స్టీల్ ప్లాంట్ ప్రగతి మార్గం జంక్షన్ వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఉక్కు ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. అగనంపూడి ప్రాంతానికి చెందిన బి. నీలకంఠరావు స్టీల్‌ప్లాంట్ ఎస్ఎంఎస్ విభాగంలో సీనియర్ చార్జిమెన్గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం డ్యూటీకి బయలుదేరిన ఆయన ప్రగతి మార్గం జంక్షన్ వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పడంతో చెట్టును ఢీకొన్నారు. హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.