కంచరపాలెం పరిధిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన శుక్రవారం వెలుగు చూసింది కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎం. నవ్య(18) అనే యువతి తల్లిదండ్రులతో కలిసి కైలాసపురంలో నివాసముంటుంది. కాంప్లెక్స్ సమీపంలో ఓ స్వీట్ షాపులో పని చేస్తుంది. ఈ నేపధ్యంలో ఈ నెల5న ఉదయం10 షాపుకి బయలుదేరి వెళ్ళిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తండ్రి ఎం అప్పన్నబాబు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.