ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు విశాఖ జిల్లా డిఇఒ కార్యాలయం వద్ద గురువారం సంఘం విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యాన జిల్లా అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు అధ్యక్షతన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. తక్షణమే అక్రమ బదిలీలు నిలిపివేయాలని, బదిలీ అయిన ఉపాధ్యాయులకు జివిఎంసి, భీమిలీ పరిధిలో 14 మందికి జీతాలు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.