విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీఎం త్రివిక్రమవర్మ ఎట్టకేలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీలపై నిర్ణయం తీసుకున్నారు. సీఐల బదిలీలు, పోస్టింగ్‌లపై నిర్ణయం తీసుకోవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ముందుకువెళ్లలేకపోయారు. చివరకు నగరంలో పనిచేస్తున్న ఏడుగురు సీఐలను బదిలీ చేస్తూ సీపీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.