తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తారని వైఎస్సార్‌సీపీ విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లను తొలగించేది లేదన్నారు. మెరుగైన రీతిలో వారి వృత్తి పరిమాణాలు పెంచుతామని.. కానీ వాలంటీర్ వ్యవస్థ ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం సరైంది కాదు అన్నారు. ఇంటింటికీ తిరిగి గృహస్తుల వ్యక్తిగత సమాచారం, ఇంట్లో ఎంతమందికి వివాహేతర సంబంధాలు ఉన్నాయి.. ఎన్ని కులాంతర వివాహాలు జరిగినవి.. ఇంట్లో ఉన్న వారి వేలిముద్రలుతో సహా సమాచారాన్ని సేకరిస్తున్నారట.. దేనికి సేకరిస్తున్నారని ప్రశ్నించారు. ఆ సమాచారాన్ని ఎవరికి పంపిస్తున్నారనన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే హక్కు ఎవరికీ లేదన్నారు. వాలంటీర్లు ఎందుకు తొంగిచూస్తున్నారని.. హైదరాబాద్‌లో నానక్‌రామ్ గూడలో ఎఫ్.ఓ.ఏ సంస్థకు 700 మంది పనిచేస్తున్నది నిజమేనా అన్నారు. ఇలా సేకరించిన సమాచారం వారికి నిజంగానే పంపిస్తున్నారా..హైదరబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉన్న ఎఫ్.ఓ.ఏ (ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ) సంస్థ ఎవరిదని ప్రశ్నించారు. ఎఫ్.ఓ.ఏ సంస్థ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిదేనా.. ఆయన ఎవరు? ఆయనకు వాలంటీర్లు ఈ సమాచారం అందిస్తున్నది నిజమేనా అన్నారు.
రాష్ట్రంలో వాలంటీర్లు సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం, హైదరాబాద్ లోని నానక్ రామా గూడకు పంపుతున్నది నిజమేనా అన్నారు.ఎఫ్.ఓ.ఏ సంస్థ వాలంటీర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని ఎవరికి ఇస్తున్నది.. రాష్ట్రంలోని వారికా.. పక్కరాష్ట్రంలోవారికా.. లేక విదేశీయులకా అన్నారు. అనుమతి లేకుండా పౌరుల వ్యక్తిగత సమాచారం సేకరించడం చట్టరీత్యా నేరమని వాలంటీర్లకు తెలుసా అన్నారు. ప్రభుత్వమే ఈనేరాన్ని చెయ్యమని చెప్తున్నదా.. ఎఫ్.ఓ.ఏ సంస్థ, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, హైదరాబాద్ లో నానక్ రామ్ గూడ, 700మంది ఉద్యోగస్తులు, వాలంటీర్లు సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం అందచేతపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తక్షణమే ఒకప్రకటన చేయాలి అన్నారు. వాలంటీర్ల వ్యవస్థకూడా ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మవద్దని, ఉద్యోగస్తుల్నికూడా జైలుకు పంపిన ఘనత ఈ ప్రభుత్వానికి ఉందని హితవు పలుకుతున్నాను అన్నారు.
పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేస్తున్న వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. జనసేన పార్టీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ కూడా పవన్ వ్యాఖ్యలపై తమ అభిప్రాయాలను తెలియజేసింది. అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే సమస్యే లేదని తేల్చి చెప్పారు.