జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తణుకు సభలో వలంటీర్ల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. 'వాలంటీర్లు జగన్ వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. మీకు తెలియకుండానే మీతో తప్పు చేయిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒత్తిడికి లొంగి తప్పు చేశారు. దాని ఫలితంగా జైలుకెళ్లారు. ఇప్పుడు కూడా మీతో అలాగే తప్పు చేయిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం’ అని వ్యాఖ్యానించారు.