మహా శక్తి పేరిట.. మాయాశక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహిళా ద్రోహి చంద్రబాబు బిల్డప్‌లు ఇస్తున్నాడని, మోసకారి బాబును నారీలోకం నమ్మే పరిస్థితుల్లో లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. మహిళా పుట్టుకను అవమానించిన వ్యక్తి, మహిళలను నిట్టనిలువుతునా మోసం చేసినా వ్యక్తి చంద్రబాబు మాయాశక్తి కార్యక్రమంలో మాట్లాడిన మాటలు విని రాష్ట్రంలోని మహిళలంతా నవ్వుతున్నారన్నారు. ప్రపంచ సైకోలకు గౌరవ అధ్యక్షుడు ఎవరంటే చంద్రబాబేనని ఎవరినడిగినా టక్కున చెబుతారన్నారు.