ఎచ్చెర్ల మండలం జరజం గ్రామంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు అర్హులైన కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులను మంజూరు చేశారు. సమస్యల సత్వర పరిష్కారానికి సురక్ష కార్యక్రమం శ్రీరామ రక్షని ఎంపీపీ చిరంజీవి పేర్కొన్నారు. అర్హత ఉంటే సంక్షేమం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్, ఎంపీటీసీ శ్రీరామ్మూర్తి, తిరుపతి, గొలివి రామకృష్ణ పాల్గొన్నారు.