వర్షాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఉభయ సభలు నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలుత ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధులకు సభ్యులందరూ సంతాపం ప్రకటించారు. అనంతరం రాజ్యసభను 12 గంటలకు, లోక్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఆగస్టు 11 వరకు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 32 అంశాలను కేంద్రం ప్రవేశపెట్టనుంది.