తమిళనాడు కాంచీపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బుధవారం హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. ముత్తమిజ్ (22) అనే గర్భిణీ ప్రసవ సమయం కావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆ రోజు సాయంత్రం టాయిలెట్ కు వెళ్లగా ప్రసవ నొప్పులతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో బిడ్డ కమోడ్ లో పడిపోయింది. అయితే, చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa