మణిపూర్ లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటనపై దుమారం రేగుతోన్న సమయంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సరిగ్గా 40 కి.మీ దూరంలో అదే రోజున మరో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాంగ్ పోక్పీ ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారి స్నేహితురాలు మీడియాకు వెల్లడించారు.