హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా బనానా క్లస్టర్ కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పైలట్ దశ కింద ఎంపికైంది. అనంతపురంతోపాటు తమిళనాడులో థేని జిల్లాను కూడా బనానా క్లస్టర్ పైలెట్ ఫేజ్ కింద ఎంపిక చేసినట్లు మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 55 క్లస్టర్లను హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద గుర్తించగా అందులో 12 క్లస్టర్లు పైలట్ ఫేజ్ కింద ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రపంచం మొత్తం మీద పండించే అరటి పండ్లలో 26.5% వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. దేశంలో పెద్దఎత్తున అరటి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో ఏపీ తరువాతి స్థానంలో మహారాష్ట్ర (4966.33 మెట్రిక్ టన్నులు), తమిళనాడు (4236.96 మెట్రిక్ టన్నులు) మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 34907.54 మెట్రిక్ టన్నుల అరటి ఉత్పత్తి జరుగనున్నట్లు ఎఫ్‌ఏఓ సంస్థ అంచనా వేసిందని పేర్కొన్నారు.