మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. తాజాగా ఈ ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. దీన్ని భయంకరమైన, క్రూరమైన ఘటనగా అభివర్ణించింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. మణిపూర్లో శాంతి స్థాపనకు స్థానిక ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, మానవ హక్కులను కాపాడాలని కోరింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.