టీడీపీ అధికారంలోకి రాగానే అన్నదాత పథకం అమలు చేస్తామన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. జగన్ పాలనతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనతో పోలిస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై బడ్జెట్ ను తగ్గించిందని.. నీటి పారుదల శాఖ నిధుల్లో కోత విధించారని ఆరోపణలు చేశారు.