ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిండన్ నది నీటిమట్టం పెరిగింది. వరదల కారణంగా నోయిడాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. మంగళవారం ఎకోటెక్ 3 సమీపంలో పార్క్ చేసిన వంద కార్లు నీటిలో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు వరద ముప్పుతో అధికారులు వేలాది ఇళ్లను ఖాళీ చేయించారు. వరదల కారణంగా దాదాపు 2.50 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు.