చంద్రబాబు సీఎం అయ్యాక ఎన్నికల ఖర్చులు పెరిగాయని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్టీఆర్ ఒక భోళాశంకరుడు.. ఎవరినైనా నిలబెట్టి గెలిపించగలను అన్న విశ్వాసం పొందగలిగిన వ్యక్తి ఎన్టీఆర్.. అలాంటి లక్షణం వైయస్ రాజశేఖర్‌రెడ్డికి వచ్చింది.. ఆ తర్వాత వైయస్ జగన్‌కి వచ్చిందని తెలిపారు.. చంద్రబాబు అధికారం కోసం ఎవరితో అయినా కలుస్తాడు.. చంద్రబాబు దత్తపుత్రుడు కూడా అందరితో కలిశాడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అవ్వాలని పవన్ నానా గడ్డి కరుస్తున్నాడని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ వి సాంప్రదాయేతర రాజకీయాలన్నారు. కానీ, ఎవరి భుజాల మీదైనా ఎక్కేందుకు చంద్రబాబు చూస్తున్నాడని సెటైర్లు వేశారు.