మైదాన ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనుకబడిన వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ ఏడాది మార్చిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డి కింద ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. దాని ప్రకారం ఎస్టీ జాబితాలోని కులాలకు 7 శాతం రిజర్వేషన్ కల్పించారు. కొత్తగా ఏదైనా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వలన జానాభా ప్రాతిపదికపై రిజర్వేషన్ పరిమితిని పెంచాల్సి ఉంటుంది. కాబట్టి అప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న కులాలకు ఎలాంటి అన్యాయం జరగదని ఆయన అన్నారు.