గత ప్రభుత్వం పెంచిన జీతాలను తన ఘనతగా చెప్పుకుంటూ జగన్ సర్కారు... తమకు తీరని ద్రోహం చేసిందని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే తమకు వేతనాలు భారీగా పెరుగుతాయని, సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని అంగన్వాడీలు ఆశపడ్డారు. అయితే జగన్ మత్రం వారికి రూ.వెయ్యి మాత్రమే జీతం పెంచి, గతంలో అందుతున్న అన్ని సంక్షేమ పథకాలు నిలిపివేశారు. నవరత్నాల అమలుకు నిర్దేశించిన రూ.10వేలు ఆదాయ పరిమితి దాటిపోయిందని సాకు చూపిస్తూ... గ్రామీణ ప్రాంతాల్లోని 46వేల కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు పథకాలు కట్ చేశారు. కేవలం 9.5 శాతం జీతం పెంచి, సంక్షేమాన్ని మొత్తం ఎత్తేయడంతో దారుణంగా మోసపోయామని అంగన్వాడీలు వాపోతున్నారు.