ఏపీలో మరో రెండు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీగా వానలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందిపడుతుండటంతో.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్, విశాఖ, నంద్యాల జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, బుట్టాయిగూడెంతో పాటూ పలు మండలాల్లో స్కూళ్లకు కూడా రెండు రోజుల పాటూ సెలువులు ప్రకటించారు. నంద్యాలలో నాలుగు రోజుల పాటూ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు అధికారులు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.
మరోవైపు ఏపీలో విద్యాసంస్థలకు మరో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. ఈ నెల (జులై) 29వ (శనివారం) మొహర్రం పండగ ఉంది.. దీంతో స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం ఉంటుంది . అలాగే జులై 2 (శుక్రవారం)న కొన్ని ప్రాంతాల్లో కూడా మొహర్రం జరుపుకుంటారు. అలాగే జులై 30న ఆదివారం పాఠశాలకు, కాలేజీలకు సాధారణంగానే హాలిడే. దీంతో కొన్ని పాఠశాలలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవు ఉండొచ్చు.