కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకుదురు లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... బిక్కిన గంగాధరచౌదరి (28)కు నాలుగేళ్ల క్రితం రోజారాణితో వివాహం జరిగింది. కాగా అతను పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చదివి ఇరాక్‌లో ఉద్యోగం చేసి 15 రోజుల క్రితం స్వస్థలానికి తిరిగివచ్చాడు. ఇతనికి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అలవాటు ఉండటంతో లక్షల్లో పెట్టుబడులు షేర్ మార్కెట్లో పెట్టాడు. సుమారు రూ. 30 లక్షలు వరకు నష్టాలు చవిచూడటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాంతో మంగళవారం బ్యాంకు పని చూసుకుని వస్తానని ఇంట్లో చెప్పి బయల్దేరి కాకినాడ మెయిన్‌రోడ్డులో గల ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. రోజంతా గడచినా ఇంటికి వెళ్లకపోయే సరికి కుటుంబ సభ్యులు కాకినాడలో గాలింపు చేపట్టారు. గంగాధరచౌదరి బైక్ లాడ్జి దగ్గర ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. టూటౌన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.