మొహర్రం ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. తాజియాతో ఊరేగిస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో చోటు చేసుకుంది. పీటర్‌వార్ బ్లాక్‌లో ఉన్న ఖైటో గ్రామంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు తాజియాకు తగిలాయి. పండుగ పూట ఈ వార్త స్థానికంగా విషాదాన్ని నింపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa