ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. పాదుకా మండపం ముందున్న టీ స్టాల్‌లో మంటలు చెలరేగాయి. గ్యాస్ లీక్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. మంటల్లో టీ స్టాల్ సామాగ్రి కాలి బూడిదైంది. పాదుకా మండపంపై నిద్రిస్తున్న భక్తులు భయంతో పరుగు తీశారు. భీమడోలు ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa