ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ముస్లింల మొహరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో మొహరం పండుగను జరుపుకుంటున్నారు. పలుచోట్ల ముస్లిం సోదరులు బ్లేడ్లతో చిన్నచిన్న చాకులతో ఎదపై, వీపుపై గాయపరచుకొని రక్తం చిందిస్తూ మొక్కలు తీర్చుకున్న పరిస్థితి. మొహరం సందర్భంగా రోడ్లపై రక్తం ఏరుల్లా పారింది. గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం పంచాయతీలో ఆవలకొండ నుంచి తూగుండ్రం, ఫకీరు తోట వరకు ఫీర్లుతో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. షియా ముస్లింకు చెందిన చిన్నారులు, యువకులు, పెద్దలు.. బ్లేడ్లు, పదునైన చిన్న చాకులతో ఎదపై, వీపుపై గాయపరుచుకుని బాధాతప్తహృదయంతో రక్తం చిందించి మొక్కులు తీర్చుకుని వేడుకలు జరుపుకుంటున్నారు.