ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల అమ్మకంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లను వేలం వేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలతో బడుగుల బిడ్డలు వైద్య విద్యకు దూరమవుతున్నారన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్మకానికి పెట్టేశారని.. 50 శాతం సీట్లు అమ్మకానికి పెట్టేస్తున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, ప్రతిభ ప్రాతిపదికన దక్కాల్సిన 50 శాతం సీట్లను అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు.