విద్య, వైద్యం ప్రతి పేదవాడికి అందాలన్నది ఎన్టీఆర్ ఆశయమని టీడీపీ నాయకులు కేశినేని చిన్ని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. పేద వారికి ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగించేందుకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. పేద వాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం మూతవేసిందన్నారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు మొబైల్ క్యాంటీన్ల ద్వారా అన్నం అందిస్తున్నామని చిన్ని తెలిపారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలు వినియోగించుకోవాలని కేశినేని చిన్ని అన్నారు.