మంత్రి అంబటి రాంబాబు గురించి బ్రో సినిమాలో మంచి మంచి మాటలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఎంత సంపాదించినా పోవాల్సిందే అనే అంశాన్ని చెప్పారన్నారు. మార్గదర్శి పై పైశాచిక దాడిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడన్నారు. ఎవరు పిర్యాదు చేయకపోయినా మార్గదర్శి పై కేసు నమోదు చేశారని రఘురామ తెలిపారు. మరి ఇన్ని కంపెనీలు పెట్టిన సాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి.. తండ్రి అధికారంలోకి రాగానే అల్లా ఉద్ధిన్ అద్భుత దీపం అయ్యినట్టు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.