అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు ఫేస్ యాప్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా, కొమరాడ ఐసీ డీఎస్ పీవో కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు అందజేసిన సెల్ఫోన్లు సక్రమంగా పని చేయక పోవడం వల్ల ఫేస్ యాప్ వేయడం ఇబ్బందికరంగా ఉందన్నా రు. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో సెల్ సిగ్నల్స్ సక్రమంగా లేకపోవడం వల్ల కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తక్షణ మే ఈ యాప్ నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు మినహా యింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అంగన్వాడీ కార్యకర్తలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.