ఆరు నెలల చిన్నారికి నోబెల్ వరల్డ్ రికార్డ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. అవును మీరు వింటున్నది నిజమే.. కడప జిల్లా ప్రొద్దుటూరుుకు చెందిన ఆరు నెలల వయసులోనే బుడతడు అదరగొడుతున్నాడు. పట్టణంలోని శాస్త్రినగర్‌కు చెందిన పవన్‌కుమార్, సౌమ్యప్రియ దంపతుల కుమారుడు విశ్వనాథుల ప్రజ్వల్‌కు ఆరు నెలల వయసు. ఈ బుడ్డోడు 6 నెలల వయసులోనే పండ్లు, పక్షులు,జంతువులు, అంకెలు, కూరగాయలు, వాహనాల ఫోటోలను గుర్తు పట్టేస్తున్నాడు.
ప్రజ్వల్‌కు తల్లిదండ్రులు ఫోటోలు చూపిస్తే వాటిని చూసి వాటి పేర్లను వెంటనే గుర్తిస్తున్నాడు. తల్లిదండ్రులు దీనికి సంబంధించిన వీడియోలను మొబైల్‌లో రికార్డు చేసి ఈ నెల 19న నోబెల్ వరల్డ్ రికార్డు కోసం ఆ సంస్థకు పంపారు. ఈ వీడియోలను పరిశీలించిన నిర్వాహకులు ఈ చిన్నారి ప్రతిభను గుర్తించి ఆన్‌లైన్ ద్వారా నోబెల్ వరల్డ్ అవార్డును ఇంటికి పంపారు. ప్రజ్వల్ ఆరు నెలల వయసులోనే అవార్డు అందుకోవడంతో కుటుంబసభ్యులు, బంధువుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అంతేకాదు ప్రజ్వల్ సోదరి విశ్వనాథుల వినీష కూడా నాలుగేళ్ల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, నోబెల్ వరల్డ్ రికార్డు, కలాం వరల్డ్ రికార్డు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు వంటి ఐదు రికార్డులను సాధించింది. ఈ ఇద్దరు పిల్లలు చిన్న వయసులోనే అవార్డుల్ని సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.. ఈ చిన్నారులను స్థానికులు అభినందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రజ్వల్ ఆరు నెలలకే ఈ అవార్డు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లల తెలివి తేటలు చూసి తల్లిదండ్రులు ఆనందంలో ఉన్నారు.