తెలుగు రాష్ట్రాల మీదుగా మరో వందే భారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కర్ణాటకలోని యశ్వంతపురకు ఈ ట్రైన్ నడవనుంది. ఏపీలోని నంద్యాల జిల్లా డోన్ మీదుగా ఆగస్టు 6న వందేభారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్ ప్రయాణించనున్నట్లు గంతకల్లు డివిజన్ అడిషనల్ రైల్వే మేనేజర్ వెల్లడించారు. గంతకల్లు డివిజన్‌లో డోన్ రైల్వే స్టేషన్ మెుదటిది కావటంతో ఇక్కడి నుంచి ప్రారంభోత్సవాలు జరుగుతాయాన్నారు.
డోన్ నుంచి కాచిగూడ వరకు ఇవాళ వందేభారత్ ట్రయల్ రన్ జరుగుతుందని చెప్పారు. గుంతకల్లు డివిజన్‌లోని డీఆర్‌ఎంతో పాటు పలు విభాగాలకు చెందిన అధికారులంతా డోన్‌లో జరిగే ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని వెల్లడంచారు. డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్లలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పిటికే రెండు వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు మెుదటిది కాగా.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెండో ట్రైన్ ప్రారంభించారు. వందే భారత్ ట్రైన్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ ఉంది. ప్రయాణికులు వాటిల్లో ప్రయాణించటానికి మెుగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని వందే భారత్ ట్రైన్లు నడిపించాలని రైల్వేశాఖ యోచిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ - కర్ణాటక మధ్య మరో వందే భారత్ ట్రైన్ నడపాలని గతంలో ప్రతిపాదనలు వచ్చాయి.
హైదరాబాద్- బెంగళూరు నగరాల మధ్య రాకపోకలు సాగించే వారు అధికంగా ఉంటారు. ఈ నగరాల మధ్య వందే భారత్ ట్రైన్ నడిపితే.. రెండు ప్రధాన టెక్ హబ్‌లను కలిపినట్లవుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ మేరకు కాచిగూడ నుంచి యశ్వంతపురకు ట్రైన్ నడపాలని డిసైడ్ అయ్యారు. ఈ ట్రైన్‌ను ఏపీలోని పలు స్టేషన్లు కలుపటం ద్వారా మూడు రాష్ట్రాలను కవర్ చేసినట్లు ఉంటుందని భావించిన రైల్వేశాఖ డోన్ మీదుగా నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇక సికింద్రాబాద్ - పుణే మధ్య కూడా మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నడిపేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది.