విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర మంగళవారం నాటికి ఎస్. కోటకు చేరింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి దేవి జంక్షన్ వరకు విద్యార్థులు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్ కు బట్టన్ నొక్కుడుపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యల పరిష్కారంపై లేదని ప్రసన్నకుమార్ దుయ్యబట్టారు.