విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రికి వివరించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.