వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎనలేని కష్టాలు వచ్చాయని , రైతులని పట్టించుకోకుండా అన్యాయం చేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కష్టకాలంలో అన్నదాతలకు అండగా నిలవాల్సిన జగన్ తాడేపల్లి ప్యాలె్‌సను వదిలి బయటకు రావడం లేదని విమర్శించారు. తొమ్మిది నెలలు ఓపిక పడితే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, రైతుల కష్టాలను తీరుస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇనాం భూముల సమస్య ఉందని, అధికారంలోకి వచ్చాక సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవ అనుభవదారులను గుర్తిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యాన పంటలకు మళ్లీ రాయితీలు, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.