అడిగిన వెంటనే సిగరెట్ కొనివ్వలేదని ఓ వ్యక్తి బాలుణ్ని దారుణంగా హతమార్చాడు. కర్ణాటకలోని క్రిష్ణగిరి సమీపంలో పాంచాలియూరుకి చెందిన ఇర్ఫాన్ (14) బుధవారం రాత్రి అదే ప్రాంతంలో వెళ్తుండగా ఓ మద్యం షాపు వద్ద మందుబాబు అతన్ని పిలిచి సిగరెట్ కొనివ్వాలని అడిగాడు. అందుకు ఇర్ఫాన్ నిరాకరించడంతో సదరు వ్యక్తి బైక్ తో ఢీకొట్టి హత్య చేశాడు. దీనిపై బంధువులు ఆందోళన చేయగా, పోలీసులు సద్ది చెప్పి నిందితునిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa