మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారికీ చాట్‌బాట్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు తెలియజేసారు. పిర్యాదు చెయ్యవలసిన పద్దతి ఎలాగంటే,, ముందుగా 94409 00004 నెంబరు వాట్స్ అప్ కి హాయ్ లేదా హెల్ప్ అని పంపాలి. ఆ తరువాత ‘వెల్‌కమ్ టు చిత్తూరు పోలీస్’ పేరున ఒక లింకు ఆ మొబైల్‌కు వస్తుంది. ఆ లింకులో గూగుల్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. జిల్లా పేరు, వయసు, తండ్రి పేరు, చిరునామా, కాంటాక్టింగ్ నెంబరు, మిస్సయిన మొబైల్ మోడల్, ఐఎంఈఐ నెంబరు, మిస్సయిన ప్లేస్ నెంబరును సబ్మిట్ చేసిన వెంటనే ఫిర్యాదు పూర్తవుతుంది. ఆ తరువాత పోలీసులు మొబైల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa