పార్లమెంటులో రాష్ట్రానికి సంభందించి విభజన హామీలు సాధనకు ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెడుతున్నట్లు వైయస్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్, ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. పది మంది ఎంపీలతో ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్‌మెంట్ బిల్–2023ను ప్రైవేటు మెంబర్ బిల్లుగా ప్రవేశ పెట్టబోతున్నామని చెప్పారు. విభజన హామీల అమలుకు సంబంధించిన ప్రైవేటు మెంబర్ బిల్లును గతంలో మా పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయితే ఆ బిల్లు ఫైనాన్స్ తో ముడిపడిన అంశం కావడం వల్ల లోక్ సభలోనే ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో మేము ఆ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టామని చెప్పారు.