శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండల పరిధిలోని కేఎన్ పాళ్యం సమీపంలో ఓ తోటలోని టమాటాలను దొంగలు కోసుకుపోయారు. గ్రామానికి చెందిన రైతు రామాంజి 2ఎకరాల్లో టమాటా సాగు చేశాడు. శుక్రవారం ఉదయం తోటకు వెళ్లి చూసేసరికి కోతకొచ్చిన టమాటాలు కనిపించలేదు. సుమారు రూ.90వేల విలువజేసే (30 బాక్సులు) టమాటాలను దొంగలు కోసుకుపోయారని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa