అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలువురికి వార్నింగ్ ఇచ్చారు. తనను వెంటాడి వేధిస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, సాక్షులు ఎవరినీ వదలబోనని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో హెచ్చరికను ఉంచారు. తనపై కేసు దాఖలు చేసిన ప్రభుత్వ న్యాయవాదులను బెదిరించేలా రూపొందించిన యాడ్ ను టీవీలో ప్రసారం చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో న్యాయశాఖ రంగంలోకి దిగింది.