పొన్నూరు మండలం ములుకుదురు గ్రామంలో శనివారం ఓసి అంగన్వాడి కేంద్రం వద్ద పౌష్టికాహార కిట్లను ఎమ్మెల్యే కిలారి రోశయ్య లబ్ధిదారులకు అందించారు. 11 రకాల పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని వీటిని గర్భిణీలు, బాలింతలు విధిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు గ్రామ వైసిపి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.