గుంటూరు జిల్లా కాకుమాను మండలం, కొండపాటూరులో ప్రభుత్వ పోరంబోకులో నివసిస్తున్న ఒక మహిళా సర్వ సభ్య సమావేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్ళితే..... తాము నడిచేందుకు దారి లేకుండా నిడుబ్రోలు సుబ్బారావు అనే వ్యక్తి మట్టి తోలించారని, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని పురుగు మందు తాగేందుకు యత్నించగా.. ప్రజాప్రతినిధులు, అధికారులు అడ్డుకున్నారు. స్నానానికి వెళ్లినా కూడా వీడియోలు తీస్తున్నారని, అసభ్య పదజాలంతో ధూషిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు పట్టించుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది.