ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. మదనపల్లె రూరల్ డ్రైవర్స్ కాలనీ వద్ద షేక్ అల్తాఫ్(19) అనే యువకుడిపై బైక్ పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఓ బాలికతో మాట్లాడుతున్నాడనే నెపంతోనే పెట్రోల్ పోసి నిప్పంటించారని బాధితుడు ఆరోపించారు. బాధితుడికి తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa