జార్ఖండ్‌లోని లతేహర్ గ్రామంలో వింత సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ గ్రామంలో మనుషుల్లాగానే ఆవులు, గేదెలు, ఎద్దులు కష్టపడి పనిచేస్తాయి. మనుషులు ఎలా ఒక రోజు సెలవు తీసుకుంటారో ఇక్కడి జంతువులకు కూడా రెస్ట్ ఇస్తారు. దీనికంటూ ప్రత్యేక చరిత్ర ఉంది. అప్పట్లో పొలం పనులు చేస్తూ ఎద్దులు, గేదెలు చనిపోయేవట. దాంతో వాటికి విశ్రాంతి ఇచ్చేందుకు ఒక రోజు సెలవు ఇవ్వాలని గ్రామస్థులు నిర్ణయించారు. దాంతో ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతోంది.