నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దామరమడుగు రామచంద్రారెడ్డి నగర్ వద్ద జాతీయ రహదారిపై ట్యాంకర్, టూరిస్టు బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డుకు అడ్డుగా వాహనాలు ఉండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa