కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ బదులుగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత CrPCలో హోంశాఖ 313 మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ బిల్లులపై చర్చించేందుకు స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేసింది.