వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని సిబీఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 18 కి వాయిదా వేసింది. మాజీ ఐఏఎస్ అజయ కల్లాం వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. 161 సీఆర్పీసీ నోటీస్ ఇవ్వలేదని అజేయ కల్లాం తరుపు న్యాయవాది వాదించారు. మెసేజ్ చేసి సీబీఐ విచారణకు పిలిచారు. తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది వికాస్ సింగ్ అని.. అయితే తన స్టేట్‌మెంట్‌పై సంతకం ముఖేష్ శర్మది ఉందని అజేయ కల్లాం కోర్టుకు తెలిపారు. సీనియర్ ఐపీఎస్‌లు అయి ఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదన్నారు. తాను చెప్పింది యదాతథంగా రికార్డు చేయలేదని... దర్యాప్తు వెనుక దురుద్దేశం ఉందన్నారు. సీబీఐ చార్జిషీట్‌లో తన స్టేట్మెంట్ తొలగించాలన్నారు. తిరిగి తన స్టేట్మెంట్ రికార్డు చేయాలన్నారు. అజేయ కల్లం తరుపు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.