విజయనగరం జిల్లా, బొబ్బిలి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బొబ్బిలి రైల్వే ఔట్ పోస్టు హెడ్ కాని స్టేబుల్ ఎస్.కృష్ణారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామభద్రపురం గ్రామానికి చెందిన గొర్లె చిన్నారావు (30) అనే ఆటో డ్రైవరు బొబ్బిలి రైల్వేస్టేషన్ సమీపంలో బహిర్భూ మికి వెళ్లేందుకు పట్టాలు దాటుతున్న సమయంలో విశాఖ వైపు వెళుతున్న గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో ఆయన అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయాడు. రైలు డ్రైవర్ డొంకినవలసలో ఇచ్చిన సమాచారం మేరకు అర్ధరాత్రి సమయంలో తమకు విషయం తెలిసిందన్నారు. మృతుని ఆధార్ కార్డు, సెల్ఫోన్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించామన్నారు. పోస్టుమా ర్టం పూర్తయిన తరువాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. మృతు నికి భార్య గోపాలమ్మ, ఏడు, ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ కృష్ణారావు తెలిపారు.