వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే వైసీపీకి ఏపీలో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. శుక్రవారం నాడు ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ ఒక వేళ షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్తే తన తండ్రి(వైఎస్సార్) రుణం తీర్చుకున్నట్లు ఉంటుంది. జగన్ వైఖరీని చూసి రాజశేఖర్‌రెడ్డి పైన నించి దిగి వస్తే ఖచ్చితంగా ఓటు వేయరు. విశాఖపట్నంలో వారాహి 3 యాత్ర ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ రుషికొండకు పవన్ కళ్యాన్‌ను వెళ్లనివ్వరు. పవన్ కళ్యాణ్ చిరునవ్వులతో వైసీపీ ప్రభుత్వంపై పిడుగులు కురిపించారు.లిక్కర్ 35 వేల కోట్లు కొట్టేస్తున్నరని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్‌ను సమర్థిస్తాను. రుషికొండలో కట్టేది ఆఫీసులు కాదు, జగన్ ఇల్లు. అక్కడకి పవన్ కళ్యాణ్ వెళ్తే కట్టేది ఇల్లు అనేది అందరికీ తెలుస్తుంది.వైఎస్ భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం బాగోలేదని బెయిల్ వేశారు.ఇంట్లో బాగోలేదని ఇంకొకరు బెయిల్ పిటిషన్ వేశారు.చూస్తుంటే ఒంట్లో బాగోలేని వారికి బెయిల్ ఇవ్వొచ్చని అనుకుంటున్నాను. ఎంపీ, ఎమ్మెల్యేల కేసు కాకపోయినా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్‌కి పిటిషన్ వేశారు..ఇది సమంజసమా అనేది చూడాలి. సునీత రెడ్డి అడగాల్సిన అంశాలు ఇవ్వన్నీ. అజయ్ క్లలం ఇప్పుడు పిటిషన్ వేయాల్సిన అవసరం లేదు. కేసు ఫైనల్‌కి వచ్చినప్పుడు చెప్తే సరిపోయేది’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.