ఏపీలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏపీ తీరానికి ఆనుకొని ఉందని తెలిపింది. దీనికి తొడు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగుతోందని పేర్కొంది.