తిరుమలలో విషాద ఘటన జరిగింది. అలిపిరి నడకదారిలో కనిపించకుండాపోయిన చిన్నారి లక్షిత మృతదేహాన్ని ఉదయం నరసింహ స్వామి ఆలయం దగ్గరు గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే చిన్నారిపై చిరుత దాడి చేసిందని భావించారు.. కానీ ఎలుగుబంటి దాడి చేసి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఫారెస్ట్ అధికారులు తిరుపతి రుయాలో పాప మృతదేహాన్ని పరిశీలించారు. పాప ఒంటిపై గాయాలను బట్టి.. దాడి జరిగిన విధానాన్ని బట్టి ఎలుగుబంటిగా అనుమానిస్తున్నారు.
ఇది చాలా దురదృష్టకరమైన ఘటనని.. తమ అంచనా ప్రకారం ఎలుగుబంటి దాడిగా అనుమానిస్తున్నామన్నారు. సాధారణంగా ఎలుగుబంట్లు ముందుగా తలపై దాడి చేస్తాయంటున్నారు. అందుకే తాము ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చాక దీనిపై క్లారిటీ వస్తుందంటున్నారు. తాము ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాల్సి ఉందని.. తమ సిబ్బందితో కలిసి ఆ సమీప ప్రాంతాల్లో గాలిస్తామన్నారు. ఆ జంతువును ఎలా ట్రాప్ చేయడంపై ఫోకస్ పెడతామంటున్నారు. చిరుత చిన్నారిని లాక్కెళ్లినట్లు ఎవరూ చూడలేదని.. అందుకే తాము అనుమానిస్తున్నామన్నారు.
పాప కనిపించడం లేదనే చెప్పారని ఇలా జంతువు లాక్కెళ్లినట్లు ఎవరూ గుర్తించలేదన్నారు. కుటుంబ సభ్యులతో కాకుండా వారికి దూరంగా చిన్నారి ఒంటరిగా నడుస్తూ కనిపించిందన్నారు. ఈ విషయాన్ని సీసీ ఫుటేజ్‌లో గమనించామంటున్నారు. అందుకే పాపం కనిపించకుండా పోయినా గుర్తించలేకపోయారని చెప్పుకొచ్చారు. ఈ అంశాలపై క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతుంది అంటున్నారు. అంతేకాదు ఇటీవల తిరుమల నడక మార్గంలో ఎలుగుబంటి సంచిరించింది. సీసీ ఫుటేజ్‌లో కూడా రికార్డైంది.. దీంతో టీటీడీ భక్తుల్ని అప్రమత్తం చేసింది. ఎలుగుబంటి కూడా రెండుసార్లు ఆ ప్రాంతంలో ప్రత్యక్షమైంది. దీనిని బట్టి ఆ ఎలుగుబంటి చిన్నారి లక్షితపై దాడి చంపేసిందనే అనుమానాలు మొదలయ్యాయి.. కానీ పోస్ట్ మార్టర్ రిపోర్ట్ వస్తే కానీ పూర్తిగా క్లారిటీ రాదని చెబుతున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెంది దినేష్, శశికళ దంపతులు బంధువులు సహా 10మంది తిరుమలకు కాలినడకన బయల్దేరారు. శుక్రవారం రాత్రి 70.30 సమయంలో దినేష్ కుమార్తె ఆరేళ్ల లక్షిత కనిపించలేదు. అయితే వెంటనే కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు గాలింపు చర్యలు చేపట్టారు.. కానీ ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. శనివారం ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గర మృతదేహాన్ని గుర్తించారు. తిరుపతి రుయా ఆసుపత్రి కి మృతదేహం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి లక్షిత మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు.