శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం పూజలు ఘనంగా నిర్వహించాలని దక్షిణ ఎమ్మేల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు. దేవస్థానం అధికారులు ముద్రించిన బ్రోచర్‌ను ఆయన శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు. భక్తులకు అన్ని సదుపాయాలతో అమ్మవారికి పూజలు జరిపించాలన్నారు. విశాఖ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.