కార్వేటినగరంలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక వేడుకలు శనివారం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి, ధ్వజ అవరోహణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కేశవరెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామికి, ఎండోమెంట్ అధికారులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.